విజయ్‌కి ఏఎంఎంకే పార్టీ మద్దతు అంటూ వార్తలు... స్పందించిన దినకరన్
- టీవీకేకు తాము మద్దతివ్వడం లేదన్న దినకరన్
- గవర్నర్‌కు జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు తెలిసిందని వెల్లడి
- మా ఎమ్మెల్యే సంతకం పెట్టిన అసలు లేఖ ఎక్కడుందని ప్రశ్న
- ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడి
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తాము మద్దతిస్తున్నామని జరుగుతున్న ప్రచారాన్ని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కొట్టిపారేశారు. విజయ్ పార్టీకి తాము మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మన్నార్గుడి నియోజకవర్గం నుంచి ఏఎంఎంకే అభ్యర్థి ఎస్.కామరాజ్ విజయం సాధించారు. తమ ఎమ్మెల్యే టీవీకేకు మద్దతిస్తున్నట్లు ప్రచారం సాగుతోందని, కానీ అందులో నిజం లేదని తెలిపారు.
తమ పార్టీ ఎమ్మెల్యే టీవీకేకు మద్దతిస్తున్నట్లు గవర్నర్‌కు టీవీకే నేతలు జిరాక్స్ కాపీ ఇచ్చినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే అసలైన లేఖ ఎక్కడ ఉందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అది లభిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.
టీవీకేకు మద్దతిస్తున్నట్లు తాను లేఖపై సంతకం చేసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ కూడా తోసిపుచ్చారు. అది ఏఐ వీడియో అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాము ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయకూడదని, వెంటనే దీనిని పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టీవీకే అధినేత విజయ్ త్వరలో వీసీకే చీఫ్ తిరుమావళవన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. తనకు మద్దతివ్వాలని విజయ్ కోరనున్నారు.