భార్య కొత్త చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసలు.. 'సతీ లీలావతి' అద్భుతమన్న మెగా ప్రిన్స్

  • లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా 'సతీ లీలావతి'
  • పెళ్లి తర్వాత లావణ్య నటించిన తొలి చిత్రం
  • 'సతీ లీలావతి' ఒక ఫన్ రైడ్ అంటూ వరుణ్ తేజ్ రివ్యూ
  • రేపు (మే 8) ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన భార్య, నటి లావణ్య త్రిపాఠి నటించిన కొత్త చిత్రం 'సతీ లీలావతి'పై ప్రశంసల వర్షం కురిపించారు. పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న తొలి చిత్రమిది. మే 8న (శుక్రవారం) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"సతీ లీలావతి సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన కథనంతో, చక్కటి నటనతో సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారు," అని వరుణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇదే క్రమంలో తన భార్య లావణ్యను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ నోట్ కూడా రాశారు. "ఈ సినిమా నిర్మాణ సమయంలో నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు వ్యక్తిగతంగా తెలుసు. నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడతాను. చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు, శుభాకాంక్షలు," అని వరుణ్ తెలిపారు.

తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో దేవ్‌ మోహన్‌ హీరోగా నటించారు. నరేశ్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.


Varun Tej
Lavanya Tripathi
Sathi Leelavathi
Telugu Movie
Movie Review
Mega Prince
Tathineni Satya
Dev Mohan
Family Entertainer
Telugu Cinema

More Telugu News