నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు

Nellore Gears Up for TDP Mahanadu Grand Preparations Begin
  • భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు
  • టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ
  • మే 27 నుంచి 29 వరకు ఇఫ్కో సెజ్‌లో మూడు రోజుల వేడుక
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు సన్నాహాలు నెల్లూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు నిన్న భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మహానాడును నెల్లూరులో నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నాయకత్వం సంకల్పించింది.

నెల్లూరు నగర సమీపంలోని కొడవలూరు మండలం, ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నెల్లూరులో జరగబోయే మహానాడు టీడీపీ చరిత్రలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయేలా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 2200 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో నిర్వహిస్తుండటంతో లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

మొదటి రెండు రోజులు సుమారు 25 వేల మంది ప్రతినిధులు, చివరి రోజు బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు నేతలు వివరించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశిం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, కురుగుండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Chandrababu Naidu
Nellore Mahanadu
TDP Mahanadu
Telugu Desam Party
Ponguru Narayana
Anam Ramanarayana Reddy
Vemireddy Prabhakar Reddy
Andhra Pradesh Politics
NTR Jayanthi
Kodavaluru

More Telugu News