విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిస్తుందా... ఆ పార్టీ ఏం చెప్పిందంటే?
- ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు తక్కువపడుతున్న సీట్లు
- విజయ్‌కి మద్దతివ్వాలని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల డిమాండ్
- టీవీకేకు తాము సహకరించేది లేదని స్పష్టం చేసిన అన్నాడీఎంకే
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి మరో ఆరు సీట్లు తక్కువ పడుతున్నాయి. విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మాత్రమే మద్దతు పలికినప్పటికీ, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ మాత్రం ససేమీరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కి అన్నాడీఎంకే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని అన్నాడీఎంకే పార్టీ కొట్టిపారేసింది.
అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కి కావాల్సిన స్థానాలు, వచ్చాయా లేదా అనే అంశంతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనూ టీవీకేకు అన్నాడీఎంకే సహకరించదని స్పష్టం చేశారు.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను పక్కన పెట్టి, విజయ్‌కి మద్దతిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరికొందరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతివ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అన్నాడీఎంకేకు 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సుమారు 30 మంది విజయ్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్‌తో కలిసేందుకు పార్టీ అధినేత పళనిసామి మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ మునుసామి నుంచి పై ప్రకటన వెలువడింది.