అలా చేస్తే కేసులు వాపస్: మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన

Mangli Lawyer Subbarao suggests returning money to victims to withdraw cases
  • బాధితులకు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకుంటామన్న న్యాయవాది
  • కానీ ఈ కేసులో ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం
  • మంగ్లీ, ఆమె సోదరుడిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడి
  • వీటికి వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న
మైక్రోఫైనాన్స్ కేసులో గాయని మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన చేశారు. ఈ కేసులోని బాధితులకు మంగ్లీ, ఆమె సోదరుడు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. మైక్రోఫైనాన్స్ కేసులో మంగ్లీ ప్రతిసారి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండలలో కేసులు ఉన్నాయని తెలిపారు.

ఈ కేసులకు సంబంధించి వారు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మైక్రోఫైనాన్స్ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తాము డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసినట్లు తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని ఆయన తెలిపారు.

మైక్రోఫైనాన్స్ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మించి మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది కోట్లాది రూపాయల మోసగించారని పలువురు బాధితులు సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది సుబ్బారావును కలిశారు. ఈ విషయం తెలుసుకోవడానికి సుబ్బారావు సంప్రదించగా, మంగ్లీ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు, తనపై దుష్ప్రచారం చేయడం ద్వారా న్యాయవాది సుబ్బారావు ప్రాచుర్యం పొందాలనుకుంటున్నారని మంగ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Mangli
Mangli case
Subbarao advocate
Microfinance case
Telangana news
CV Anand DGP
Revanth Reddy CM

More Telugu News