టీవీకేకు మద్దతుగా అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు

Anna DMK MLAs Support Vijays TVK
  • ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకే
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 10 సీట్ల దూరంలో టీవీకే
  • టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న 35 మంది అన్నాడీఎంకే ఎమ్మల్యేలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ 'ముసలం' మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.


ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమై... గెలిచిన మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఒకేసారి తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే కనుక అన్నాడీఎంకే ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. 


విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో, అన్నాడీఎంకే నుంచి ఈ స్థాయి వలసలు జరిగితే టీవీకే ప్రభుత్వం మరింత సుస్థిరంగా మారే అవకాశం ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఒక కొత్త పార్టీ వైపు చూడటం తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రక మార్పుగా భావించవచ్చు.
Go Back to Shorts
Vijay
Tamilaga Vetri Kazhagam
TVK
Anna DMK
Tamil Nadu Assembly Elections
CV Shanmugam
Tamil Nadu Politics
Political Crisis

More Telugu News