ఓడిపోయిన 24 గంటల్లోనే నియోజకవర్గంలో పర్యటించిన స్టాలిన్
- కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన స్టాలిన్
- ఓడిపోయిన మరుసటిరోజే నియోజకవర్గంలో పర్యటన
- 'ఎక్స్' వేదికగా ఫొటోలు పంచుకున్న స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర ఓటమి చవిచూసింది. కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ కూడా టీవీకే పార్టీకి చెందిన వీఎస్ బాబు చేతిలో 8 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన పార్టీ ఓడిపోవడంతో పాటు, స్వయంగా తాను ఓడిన తన నియోజకవర్గంలో స్టాలిన్ ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే పర్యటించారు. గతంలో మూడుసార్లు తనను గెలిపించిన ఆ నియోజకవర్గం ప్రజలను కలిసి మాట్లాడారు.
ఈ పర్యటనకు సంబంధించి ఫొటోలను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. కొళత్తూరుతో తనకు ఉన్న అనుబంధం గెలుపోటములకు అతీతమైనదని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం ప్రజలు తనకు పదిహేనేళ్ల పాటు అండగా నిలిచారని చెప్పారు. తన శక్తి మేరకు అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేశానని, రాష్ట్రంలో దీనిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేశానని పేర్కొన్నారు.
ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యనూ నెరవేర్చేందుకు సగర్వంగా ఈరోజు తన నియోజకవర్గంలో ప్రజలను కలిసి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. ఈ నియోజకర్గంలో తాను వెళ్లిన ప్రతి వీధిలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు, పార్కులు, లైబ్రరీలు, మ్యారేజ్ హాలులు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కాలేజీలను చూసి తన విధులను తాను నిర్వర్తించాననే సంతృప్తి కలుగుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడైనా అండగా ఉంటానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.