ఇరాన్‌పై ఇండియా ఫైర్.. యూఏఈపై అటాక్‌లో భారతీయులకు గాయాలను అంగీకరించలేమని స్పష్టీకరణ

  • యూఏఈపై ఇరాన్ దాడి
  • ముగ్గురు భారతీయులకు గాయాలు
  • అంగీకరించలేమని భారత్ ఫైర్
  • హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు
  • శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు
పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దాడులతో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా యూఏఈలోని ‘ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్’పై దాడి చేయడం పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు గాయపడడంపై విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది.

‘‘ముగ్గురు భారతీయుల గాయానికి కారణమైన ఫుజైరా దాడిని ఏమాత్రం అంగీకరించలేం. వెంటనే ఈ ఘర్షణలను విరమించుకోవాలని, పౌర మౌలిక సదుపాయాలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని కోరుకుతున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనే దిశగా సాగే చర్చలు, దౌత్య విధానాలకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం కొనసాగేలా చర్యలు తీసుకోవాలనీ కోరింది. ఈ సమస్యలన్నింటినీ శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా చేపట్టే చర్చలకు భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Iran
UAE attack
India Iran
Fujairah Petroleum Industries Zone
Indian injuries
West Asia conflict
Randhir Jaiswal
Hormuz Strait
Indian Foreign Ministry

More Telugu News