కుటుంబ సభ్యులతో విజయ్ ఆనందం.. ఫొటోలు ఇవిగో!
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం
- 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరణ
- తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్న విజయ్
- విషెస్ తెలిపిన రజనీకాంత్
తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ పెట్టిన 2 సంవత్సరాలు 2 నెలల్లోనే టీవీకేని విజయపథంలో నడిపించడం నటుడు విజయ్ కే సాధ్యమైంది. మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా... విజయ్ టీవీకే పార్టీ 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ (118)కు మరో 11 స్థానాల దూరంలో నిలిచిపోయినప్పటికీ, అధికార పీఠంపై కూర్చోవడం మాత్రం పక్కా.
ఇక, ఇవాళ ఫలితాల సరళి మొదటి నుంచి టీవీకే పార్టీకి అనుకూలంగానే ఉంది. కౌంటింగ్ సమయంలో తమ పార్టీ దూసుకుపోతుండడంతో తన ఆనందాన్ని విజయ్ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. విజయ్ గెలుపు ప్రస్థానం పట్ల తండ్రి, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్, తల్లి శోభ హర్షం వ్యక్తం చేశారు.
విజయ్ కి అభినందనలు తెలిపిన తలైవా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలుపు మార్గంలో నడిపించిన పార్టీ అధ్యక్షుడు విజయ్ కి శుభాభినందనలు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ విషెస్ తెలియజేశారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీవీకే పార్టీ సభ్యులకు అభినందనలు... అంటూ ఆయన ట్వీట్ చేశారు.