విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు

  • 27,086 ఓట్ల మెజార్టీతో ఆర్.శబరినాథన్ గెలుపు
  • మూడున్నర దశాబ్దాలుగా విజయ్ డ్రైవర్‌గా, పీఏగా పని చేస్తోన్న రాజేంద్రన్
  • విజయ్ డీఎంకే పాలనకు ముగింపు పలికారన్న రాజేంద్రన్ తనయుడు
టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌కి చాలాకాలంగా డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నరాజేంద్రన్ కుమారుడు ఆర్.శబరినాథన్ (30) విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకరరాజాపై 27,086 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శబరినాథన్‌కు 76,092 ఓట్లు రాగా, ప్రభాకరరాజాకు 49,006 ఓట్లు వచ్చాయి.

గెలుపొందిన అనంతరం ఆర్.శబరినాథన్ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. తనకు టిక్కెట్ ఇచ్చి గెలుపుకు కృషి చేసిన విజయ్‌కు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని అన్నారు. విజయ్ రాష్ట్రంలో డీఎంకే పాలనకు ముగింపు పలికారని వ్యాఖ్యానించారు.

ఆర్.శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ సుదీర్ఘకాలంగా విజయ్ డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. విజయ్ తొలి చిత్రం 'నాలైయ తీర్పు' నుంచి, దాదాపు ముప్పై ఐదేళ్లుగా ఆయన వద్ద పనిచేస్తున్నారు. చెన్నై జిల్లాలోని విరుగంబాక్కం నియోజకవర్గం నియోజకవర్గంలో 2011లో డీఎండీకే, 2016లో అన్నాడీఎంకే, 2021లో డీఎంకే విజయం సాధించగా, ఇప్పుడు టీవీకే విజయం సాధించింది.

Vijay
R Sabarinathan
TVK Party
Virugambakkam
Tamil Nadu Assembly Elections
Rajendran
DMK

More Telugu News