త్రిషకు మంచు లక్ష్మి బర్త్‌డే విషెస్... 'భారీ విజయం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

  • నటి త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి
  • భారీ విజయం రూపంలో నీకు బర్త్‌డే గిఫ్ట్ అందిందంటూ వ్యాఖ్య
  • తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపు నేపథ్యంలో ట్వీట్‌కు ప్రాధాన్యత
  • విజయ్ గెలపునే మంచు లక్ష్మి ప్రస్తావించారని సోషల్ మీడియాలో చర్చ
  • విజయ్, త్రిష బంధంపై వస్తున్న వదంతులకు మరింత బలం
నటి మంచు లక్ష్మి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే, 'భారీ విజయం' రూపంలో విశ్వం ఆమెకు ఉత్తమ బహుమతి ఇచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

శనివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా మంచు లక్ష్మి స్పందిస్తూ.. "ఎప్పటికీ అందంగా, హుందాగా ఉండే త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వేడుక చేసుకోవడానికి ఇదెంత గొప్ప రోజు! ఆ 'భారీ విజయం'తో విశ్వమే నీకు బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. నీకు ఈరోజు డబుల్ సెలబ్రేషన్స్. నీకు అంతా మ్యాజికల్‌గా ఉండాలి డార్లింగ్" అని ట్వీట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ సంచలన విజయం దిశగా దూసుకెళ్తున్న తరుణంలో మంచు లక్ష్మి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. విజయ్ తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ప్రస్తుతం విజయ్ విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ విజయాన్ని ఉద్దేశించే మంచు లక్ష్మి 'భారీ విజయం' అని పరోక్షంగా ప్రస్తావించారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. 

Trisha
Trisha Krishnan
Manchu Lakshmi
Vijay
Tamil Nadu Politics
Vijay Divorce
Kollywood
Actress Trisha
Political Victory

More Telugu News