కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో!

  • ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు
  • మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
  • గోడపై నినాదాలు రాసి ప్రచారం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • స్వయంగా కమలం పువ్వు గుర్తును చిత్రించిన కిషన్ రెడ్డి
  • కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న కేంద్రమంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి గోడలపై నినాదాలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ "ఛలో పరేడ్ గ్రౌండ్స్" అంటూ కిషన్ రెడ్డి స్వయంగా కుంచె పట్టి గోడపై రాశారు. అనంతరం బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును కూడా ఆయనే చిత్రించడం విశేషం.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అభివృద్ధి, పురోగతి దార్శనికతపై ప్రజలు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, వారి ఉత్సాహమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి స్వయంగా వాల్ రైటింగ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kishan Reddy
Narendra Modi
Telangana
BJP
Parade Grounds
Secunderabad
Chalo Parade Grounds
Wall Writing
Telangana Politics
Hyderabad

More Telugu News