కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు

KTR and Harish Rao face serious allegations from Congress leaders
  • కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం
  • హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని ధ్వజం
  • బీఆర్ఎస్ నాయకులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల కారణంగా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. వివిధ శాఖలు, ప్రాజెక్టులపై అనవసర ఆరోపణలు చేసి కాంట్రాక్టర్లను లొంగదీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్‌కు కేటీఆర్, హరీశ్ రావులు బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. రాజకీయ అస్తిత్వం కోసమే వారిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Go Back to Shorts
KTR
KT Rama Rao
Harish Rao
Telangana Congress
BRS leaders
Blackmail allegations
Contractors

More Telugu News