మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు

  • జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రాహెల్
  • ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన రాహెల్
  • దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసుల నుంచి చుక్కెదురైంది. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి చేరుకున్న అతడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన రాహెల్, ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. 


అయితే కేసు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. రాహెల్ విదేశీ ప్రయాణానికి సిద్ధమైనట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు సమయానుకూలంగా స్పందించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ పెండింగ్‌లో ఉన్నందున ప్రయాణాలకు కోర్టు అనుమతి తప్పనిసరి అని పోలీసులు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.


Shakeel
Rahel Shakeel
Jubilee Hills
Hit and Run Case
Hyderabad
Dubai
Former MLA
Police Investigation
Bail Conditions

More Telugu News