ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'వాలా 2'
  • నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ
  • 200 కోట్లు దాటిన వసూళ్లు  
  • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • తెలుగులోను అందుబాటులోకి

మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'వాలా 2'.  గతంలో వచ్చిన 'వాలా' పెద్ద హిట్. దాంతో సహజంగానే 'వాలా 2'లో అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 2వ తేదీన విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. 

సావిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, హాషిర్ .. అలన్ .. అజిన్ .. వినాయక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. విపిన్ దాస్ నిర్మించిన ఈ సినిమాకి, రజత్ ప్రకాశ్ సంగీతాన్ని అందించాడు. మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా కోసం, ఇతర భాషా ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను 'జియో హాట్ స్టార్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 

మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వస్తోంది. ఇది నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ.  తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్లను చదివిస్తుంటే, వాళ్లు కాలేజ్ లో గొడవలకి దిగుతుంటారు. చివరికి కాలేజ్ లో నుంచి గెంటేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌంతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
 


More Telugu News