టీఆర్‌ఎస్ గూటికి మాజీ మంత్రి బోడ జనార్దన్... కవితతో భేటీ!
- కవిత పార్టీలోకి మొదలైన చేరికలు
- టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన జనార్దన్
- టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత
కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ లోకి చేరికలు మొదలయ్యాయి. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈరోజు బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో కవితతో జనార్ధన్ భేటీ అయ్యారు.
కవితతో భేటీ అనంతరం బోడ జనార్దన్ మాట్లాడుతూ, త్వరలోనే తన అనుచరవర్గంతో కలిసి అధికారికంగా పార్టీలో చేరతానని వెల్లడించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.