కంపెనీల సీఈవోలు ఎక్కువగా గోల్ఫ్ ఆడతారు ఎందుకు?.. నటుడు మాధవన్ ఏం చెప్పాడో చూడండి!
- నటనలో తన ఏకాగ్రతకు గోల్ఫ్ ఆట కారణమన్న మాధవన్
- బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందన్న నటుడు
- మనతో మనం పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్ అని వ్యాఖ్య
- బిలియనీర్లు గోల్ఫ్ ఎందుకు ఆడతారో వివరిస్తూ ఆసక్తికర వీడియో షేర్
- గోల్ఫ్ క్రమశిక్షణ, మానసిక నియంత్రణను నేర్పుతుందన్న మాధవన్
ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తన నటనకు, గోల్ఫ్ ఆటకు మధ్య ఉన్న లోతైన సంబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గోల్ఫ్ తనను నటుడిగా ఎలా తీర్చిదిద్దిందో, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతను ఎలా నిలుపుకోవాలో నేర్పిందని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోతో పాటు తన పాత ఇంటర్వ్యూలోని అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో జనసమూహం మధ్య నటించడం చాలా కష్టంగా ఉండేదని మాధవన్ గుర్తుచేసుకున్నారు. చుట్టూ ఉన్నవారు చూడటం, నవ్వడం, వ్యాఖ్యలు చేయడం వల్ల దృష్టి మరలేదని చెప్పారు. అయితే, గోల్ఫ్ ఆడటం అలవాటు చేసుకున్నాక ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నానని తెలిపారు. "గోల్ఫ్ అనేది మనతో మనం పోటీపడే ఏకైక ఆట. ఇందులో ఇతరులతో పోటీ ఉండదు. అంతర్మథనం చెందుతూ, నెమ్మదిగా ఆ ఒక్క పర్ఫెక్ట్ షాట్ కొట్టడంపైనే దృష్టి పెట్టాలి" అని ఆయన వివరించారు. ఈ లక్షణమే నటనలోనూ పరధ్యానాన్ని పక్కన పెట్టి పాత్రలో లీనమవడానికి సహాయపడిందని అన్నారు.
అంతేకాకుండా, బిలియనీర్లు, అగ్రశ్రేణి సీఈవోలు గోల్ఫ్ ఎందుకు ఆడతారో విశ్లేషించే షేక్ అల్ మన్సూర్ అలీ వీడియోను కూడా మాధవన్ షేర్ చేశారు. ఈ ఆట ఓపిక, భావోద్వేగ నియంత్రణ, దీర్ఘకాలిక ఆలోచనా విధానాన్ని నేర్పుతుందని ఆ వీడియో సారాంశం. ఒత్తిడిలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, నిజాయతీగా ఉంటాడో లేదో ఈ ఆట వెల్లడి చేస్తుందని అందులో పేర్కొన్నారు.