'టెన్త్'లో ఫలించిన లోకేష్ వ్యూహం.. 100 రోజుల ప్లాన్ తో మెరుగైన ఫలితాలు
- నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల
- విద్యాశాఖ అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
- సమష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్
- గతేడాది 81.1% ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి 85.25 శాతానికి చేరిక
- ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి మెరుగుదల
- ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అనేది ఐకమత్యంగా, అంకితభావంతో సాధించిన సమష్టి విజయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, అయితే అమలు చేసిన ప్రణాళికలు విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల్లో నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ సహకారం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఫెయిలైన వారు ఆత్మన్యూనతకు గురికావొద్దని, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని భరోసా ఇచ్చారు.
100-రోజుల కార్యాచరణ ప్రణాళిక
"పూను స్పర్థలు విద్యలందే-వైరములు వాణిజ్యమందే" అనే గురజాడ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' మిషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రూపొందించిన '100-రోజుల కార్యాచరణ ప్రణాళిక' సత్ఫలితాలనిచ్చింది.
2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రణాళికలో, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను 'లీప్' మొబైల్ యాప్‌లో నమోదు చేసి, ప్రతిరోజూ 6 డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విశ్లేషించారు.
షైనింగ్ స్టార్స్ .. రైజింగ్ స్టార్స్
స్లిప్ టెస్టులలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని 'షైనింగ్ స్టార్స్', 'రైజింగ్ స్టార్స్'గా గుర్తించారు. వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
సాధనే విజయం
"సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్న వేమన వాక్కును నిజం చేస్తూ, విద్యార్థులతో క్రమం తప్పకుండా సాధన చేయించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేకంగా మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను ఉచితంగా అందించింది. ముఖ్యంగా, నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (బై-లింగ్యువల్) పద్ధతిలో, ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీషులో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇవ్వడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది.
ఏ ఒక్క అవకాశం జారకుండా
డ్యాష్‌బోర్డ్ విశ్లేషణ ద్వారా విద్యార్థుల బలాబలాలను ముందుగానే అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్రతి పాఠశాలకు 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలను పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా నిర్వహించి, వారిపై దృష్టి సారించారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు.
అమలు చేసిన పథకాలు ఇవీ
ఈ కార్యాచరణ ప్రణాళికతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా విద్యార్థులకు అండగా నిలిచాయి. రుచికరమైన మధ్యాహ్న భోజనం, 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర' పేరుతో యూనిఫాం, బ్యాగు, షూ, పుస్తకాలు వంటివి ఉచితంగా అందించారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించారు. ఈ సమన్వయ కృషి ఉత్తమ ఫలితాలకు బాటలు వేసింది.
కృషికి తగ్గ ఫలితాలు
మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ, అధికార యంత్రాంగం కృషి ఫలితంగా, మార్చి 2026 పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గతేడాది 81.1%గా ఉన్న ఉత్తీర్ణత, ఈ ఏడాది 85.25 శాతానికి చేరింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8% నుంచి 78.39 శాతానికి పెరగడం విశేషం.
భళా బాలిక
ఈ ఏడాది ఫలితాల్లో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.68% కాగా, బాలికలు 87.90% ఉత్తీర్ణతతో సత్తా చాటారు. బాలుర కంటే 5.22% అధిక ఉత్తీర్ణత సాధించి 'భళా' అనిపించుకున్నారు.
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలే మిన్న
రాష్ట్రవ్యాప్తంగా సున్నా శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 16 ఉండగా, వాటిలో 11 ప్రైవేట్ పాఠశాలలు కావడం గమనార్హం. ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలలు కేవలం 5 మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ విద్య నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.