వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ!

Nita Ambani broke into tears during SRH openers flamboyant batting in Wankhede against Mumbai Indians
  • సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్‌కు నీతా అంబానీ కంటతడి
  • వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
  • పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించిన హెడ్-అభిషేక్
ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో, 244 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై బౌలర్లు చేతులెత్తేయడం, సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆమె తన ఎమోషన్‌ను ఆపుకోలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలోనే వీరిద్దరూ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు జోడించారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

ఈ జోడీ కేవలం 8 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, డేవిడ్ వార్నర్ - శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. ముంబై ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ హెడ్, అభిషేక్ భారీ షాట్లు ఆడారు. వారి దూకుడుకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిస్సహాయంగా కనిపించగా, ఫీల్డర్లు కూడా క్యాచ్‌లను జారవిడిచారు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ చూసే నీతా అంబానీ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేయడం తెలిసిందే. 
Go Back to Shorts
Nita Ambani
Mumbai Indians
Sunrisers Hyderabad
Wnakhede Stadium
Mumbai
IPL 2026

More Telugu News