ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
- రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల
- ఫలితాలను ప్రకటించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- అధికారిక వెబ్సైట్, వాట్సాప్, యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
- ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థులు
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన అప్డేట్. పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఫలితాలను సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. వీటితో పాటు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని సందేశం పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు. అలాగే, లీప్ యాప్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా నేరుగా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.