బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో అధికారంలోకి రాబోతున్నాం: రామచందర్ రావు

  • భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా
  • మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని వెల్లడి
  • మోదీ రాకతో తెలంగాణలో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందన్న రామచందర్ రావు
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతుందని, భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించారు.

సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్ల నుంచి జన సమీకరణ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. మోదీ రాకతో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందని అన్నారు.

Ramachandar Rao says BJP will win
BJP chief Ramachander Rao

More Telugu News