నెల రోజుల్లోనే భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర
- రూ.4 నుంచి రిటైల్ మార్కెట్లో రూ.7కు పెరిగిన ధర
- ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు పడిపోయి తగ్గిన ధర
- ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు మరణించడంతో తగ్గిన ఉత్పత్తి
- దాంతో మళ్లీ పెరిగిన ధర
నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇటీవలి వరకు రూ.4కు లభించిన కోడిగుడ్డు ధర రిటైల్ దుకాణాల్లో రూ.7 పలుకుతోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనితో మార్చి నెలలో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. చాలా ప్రాంతాల్లో ఒక గుడ్డు ధర రూ.4 పలికింది. కానీ ఈ ఊరట కొన్నిరోజులే ఉంది.
తాజాగా, అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు మరణిస్తున్నాయి. దీనితో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, అందుకే కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. అదే సమయంలో గత నెలలో కిలో రూ.400 పలికిన చికెన్ ధర, ఇప్పుడు భారీగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో చికెన్ లైవ్ బర్డ్ ధర కిలో రూ.110గా ఉంది. రిటైల్ ధర రూ.137 పలుకుతోంది. డ్రెస్డ్ చికెన్ రూ.199, స్కిన్లెస్ రూ.226 వరకు ఉంది.