గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన ఆప్, కాంగ్రెస్
- అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాల్లో బీజేపీ ప్రభంజనం
- కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఘోర ఓటమి
- పోర్ బందర్, మోర్బీ వంటి ప్రాంతాల్లో అన్ని సీట్లలో బీజేపీ విజయం
- నగరాలతో పాటు పల్లెల్లోనూ పట్టు నిలుపుకున్న కాషాయ పార్టీ
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో కమలం పార్టీ గెలుపు యాత్ర కొనసాగింది. ఈ ఫలితాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉన్న బలమైన పట్టును మరోసారి చాటిచెప్పాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికే కోల్పోయింది.
అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో భారీ గెలుపు
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 192 సీట్లు ఉండగా.. బీజేపీ 158 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. సూరత్ నగరంలో కమలం హవా స్పష్టంగా కనిపించింది. అక్కడున్న 120 సీట్లలో కాషాయ పార్టీ 115 గెలుచుకుంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఆప్ 4 సీట్లు, కాంగ్రెస్ కేవలం 1 సీటు మాత్రమే గెలిచాయి.
రాజకోట్, వడోదర, భావ్‌నగర్ ఫలితాలు
రాజకోట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 72 సీట్లలో బీజేపీ 65 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 7 సీట్లకు పరిమితమైంది. వడోదరలో 76 సీట్లలో 69 బీజేపీ ఖాతాలో పడగా, కాంగ్రెస్ 6 సీట్లు గెలిచింది. భావ్‌నగర్‌లో 52 సీట్లకుగానూ బీజేపీ 44 గెలిచింది. కాంగ్రెస్ 8 స్థానాలు పొందింది. ఈ మూడు నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఖాతా తెరవలేకపోయింది. పోర్ బందర్, మోర్బీ నగరాల్లో బీజేపీ చారిత్రక విజయం అందుకుంది. ఈ రెండు చోట్ల ఉన్న 52 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. సురేంద్రనగర్‌లో 52 సీట్లలో బీజేపీ 51 గెలిచింది. జామ్‌నగర్‌లో 54 సీట్లు తన ఖాతాలో వేసుకుంది.
మున్సిపాలిటీలు, పంచాయతీల లెక్కలు
84 మున్సిపాలిటీల్లోని 2,030 సీట్లలో బీజేపీ 1,791 స్థానాలు గెలిచి విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ 414 సీట్లు సాధించింది. 34 జిల్లా పంచాయతీల్లో ఉన్న 1,090 సీట్లలో కమలం పార్టీ 568 గెలుచుకోగా, కాంగ్రెస్ 77 సీట్లకే పరిమితమైంది. ఇక 260 తాలూకా పంచాయతీల్లోని 5,234 సీట్లలో బీజేపీ 2,397 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 591 సీట్లు దక్కాయి.
ఈ ఫలితాల ద్వారా గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడం, బీజేపీ సంస్థాగత బలం ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.