Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ స్టార్ల గల్లీ క్రికెట్.. వీడియో వైరల్!

Tim David Romario Shepherd Play Gully Cricket in Delhi Viral Video
Advertisement
  • ఢిల్లీ వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడిన ఆర్సీబీ స్టార్లు టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్
  • అభిమానులతో కలిసిపోయి భారీ షాట్లు కొడుతున్న వీడియోలు నెట్టింట‌ వైరల్
  • ఆటగాళ్ల సింప్లిసిటీపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం
  • ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న టిమ్ డేవిడ్, ఆర్సీబీ జట్టు
  • నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్ ఆడనున్న బెంగళూరు
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లు మైదానంలోనే కాకుండా బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ ఢిల్లీ వీధుల్లో స్థానిక యువకులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ ఆటగాళ్ల నిరాడంబరత చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కోసం దేశ రాజధానికి చేరుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు ప్రాక్టీస్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఈ సమయంలో టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ ఢిల్లీలోని ఇరుకైన వీధుల్లోకి వెళ్లి అక్కడి కుర్రాళ్లతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ఏమాత్రం సంకోచం లేకుండా అభిమానులతో కలిసిపోయి భారీ షాట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ వీడియోను ఒక యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "వీళ్లు చాలా సరదా మనుషులు" అంటూ క్యాప్షన్ జతచేశారు. అంతర్జాతీయ స్టార్లు తమతో కలిసి క్రికెట్ ఆడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ ఐపీఎల్ సీజన్‌లో టిమ్ డేవిడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున నంబర్ 5 స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ మ్యాచ్‌లను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో 203.52 స్ట్రైక్ రేటు, 91.50 సగటుతో 183 పరుగులు చేశాడు. మరోవైపు ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ బ్యాట్‌తో పెద్దగా రాణించకపోయినా (7 మ్యాచ్‌ల్లో 39 పరుగులు), బంతితో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు.

ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. ఇవాళ‌ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు ఇలా సరదాగా గడపడం జట్టులో సానుకూల వాతావరణాన్ని సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
Advertisement
Tim David
Tim David RCB
Romario Shepherd
Romario Shepherd RCB
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Delhi
Gully Cricket
Cricket

More Telugu News