ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ

  • శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న అబ్బాస్ అరాఘ్చీ
  • అరాఘ్చీకి స్వాగతం పలికిన పాక్ విదేశాంగ మంత్రి
  • పాకిస్థాన్ ప్రతినిధులతో ఇరాన్ సంప్రదింపులు
  • అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని తెలిపిన ఇరాన్
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అయ్యారు. అమెరికాతో శాంతి చర్చల కోసం అరాగ్చీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్, పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ , పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ స్వాగతం పలికారు.

ఈరోజు మునీర్‌తో అరాఘ్చీ బృందం భేటీ అయింది. మరోవైపు, చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ బయలుదేరారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఉండబోదని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ప్రతినిధులతో సమావేశమై ఇరాన్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికాతో యుద్ధం ముగింపు అంశంపై పాకిస్థాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు.

Abbas Araghchi
Iran
Pakistan
Islamabad
Asim Munir
US Peace Talks
Mohammad Ishaq Dar
Mohsin Naqvi

More Telugu News