కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా

  • మునీరాబాద్ బహిరంగ సభ వేదిక వద్దకు బయలుదేరిన కవిత
  • సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న కవిత, కుటుంబ సభ్యులు
  • ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరిన కవిత
మున్ముందు తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కవిత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ కోసం ఆమె తన ఇంటి నుంచి బయలుదేరే ముందు మీడియా పలకరించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సభకు బయలుదేరడానికి ముందు కవిత తన నివాసంలో సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మతపెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అక్కడి నుంచి సభవేదికకు వెళ్తారు.

K Kavitha
Kalvakuntla Kavitha
Telangana CM
Telangana politics
Munirabad
Medchal Malkajgiri

More Telugu News