బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎవరు గెలుస్తారో చెప్పిన ఫరూక్ అబ్దుల్లా

  • బెంగాల్‌లో దీదీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్య
  • ఇజ్రాయెల్ తమను యుద్ధం వైపు పురికొల్పిందని ట్రంప్ తెలుసుకున్నారన్న ఫరూక్ అబ్దుల్లా
  • ప్రతి దేశం యుద్ధం ముగింపు కోసం ప్రయత్నం చేయాలని సూచన
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గెలిచే పార్టీలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా జోస్యం చెప్పారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో స్టాలిన్ గెలవబోతున్నారని, ఇది దేవుడి ఆశీర్వాదమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మూడు కీలక రాష్ట్రాలలో ఇండియా కూటమి పక్షాలే విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇరాన్, అమెరికా యుద్ధం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో, శాంతి చాలా అవసరమని, ఆ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనకపోతే ఈ ప్రపంచానికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి దేశం, ప్రతి నాయకుడు ఈ యుద్ధం త్వరగా ముగిసేలా ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇరాన్‌తో యుద్ధం వైపు తమను ఇజ్రాయెల్ పురికొల్పిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుసుకున్నారని ఆయన అన్నారు. శాంతి దిశగా ఆయన ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని పేర్కొన్నారు. చైనా, రష్యాలు కూడా ఈ యుద్ధం త్వరగా ముగిసేలా జోక్యం చేసుకోవాలని అన్నారు. దేవుడి దయవల్ల యుద్ధం త్వరగా ముగియాలని కోరుకున్నారు.

డ్రగ్స్‌పై పోరుకు కేంద్రం చేపట్టిన 'నషా ముక్త భారత్ అభియాన్'పై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈ పోరాటం విజయం సాధించాలంటే ప్రజల మద్దతు అవసరమని అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే డ్రగ్స్ ముప్పును అంతం చేయలేమని వ్యాఖ్యానించారు. ప్రజలు మద్దతిస్తే దేవుడి దయవల్ల ఈ ముప్పు అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Farooq Abdullah
West Bengal elections
Tamil Nadu elections
Kerala elections
Mamata Banerjee

More Telugu News