తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు

  • బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు
  • సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం నాడు 25,550 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ.4.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వివరించారు.
 

Tirumala
Tirumala temple
TTD
Tirupati
Srivari Hundi
Pilgrim rush
Devotees
Andhra Pradesh temples
Vaikuntam Queue Complex
Tonsure

More Telugu News