అభిషేక్ శర్మ సెంచరీ పూర్తయ్యాక కావ్య పాప రియాక్షన్ వైరల్!
- ఉప్పల్‌లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ
- శతకం తర్వాత కావ్య మారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
- 135 పరుగులతో అజేయంగా నిలిచిన యువ ఓపెనర్
- టీ20ల్లో అత్యధిక సెంచరీల కోహ్లీ రికార్డు సమం
- ఢిల్లీ ముందు 243 పరుగుల భారీ లక్ష్యం
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర శతకంతో కదం తొక్కాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిషేక్ శతకం పూర్తి చేయగానే స్టాండ్స్‌లో ఉన్న కావ్య చప్పట్లతో అభినందిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చిన్న పిల్లలా కేరింతలు కొట్టారు. ఆమె సంతోషానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తం మీద 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఈ సెంచరీతో అభిషేక్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (9) రికార్డును సమం చేశాడు. అలాగే, ఐపీఎల్ చరిత్రలో ఇది ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోరు. సన్‌రైజర్స్ తరఫున 2,000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు.
అభిషేక్‌కు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (37) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కేవలం 13 బంతుల్లోనే 37 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరి ధాటికి సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు సాధించింది.