తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత

TDP leader joins Telangana Jagrithi
  • తెలంగాణ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్
  • జాగృతి కండువా కప్పి ఆహ్వానించిన కవిత
  • త్వరలో పార్టీని ప్రకటించనున్న కవిత
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు సయ్యద్ అహ్మద్ మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. ఆయన రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడిగా ఉన్నారు. ఈరోజు సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి కవిత జాగృతి కండువా కప్పారు.

కల్వకుంట్ల కవిత తన తెలంగాణ జాగృతి సంస్థను త్వరలో రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు. అయితే పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెల 25వ తేదీన ఆమె తన పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణ జాగృతి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పేర్లను ఆమె పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana TDP leader joins Jagrithi
Syed Ahmed join Telangana Jagrithi

More Telugu News