కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి వెళ్లాను.. కానీ!: హరీశ్ రావు
- తన ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి సీఎంవో నుంచి లీకులు ఇచ్చారని విమర్శ
- విషయం ఉన్నవారు ఎవరూ ఇలాంటి పనులు చేయరన్న హరీశ్ రావు
- రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని వెల్లడి
తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాను ఢిల్లీకి వెళ్లానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయన చెప్పిన పని కోసమే తాను, వినోద్ కుమార్ తదితరులం వెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రి పెట్టే అక్రమ కేసులను ఎదుర్కోవడానికి, కాళేశ్వరం కేసులపై ఢిల్లీకి వెళ్లి లాయర్లతో చర్చించినట్లు చెప్పారు.
కానీ తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంవో నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్‌లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు.
రేపు ఓటుకు నోటు కేసు విచారణ
రేపు ఓటుకు నోటు కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి న్యాయవాదులతో చర్చించామని అన్నారు. ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా ఇంప్లీడ్ అయ్యారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరఫున అనామక లాయర్‌ను పెట్టారని విమర్శించారు. నిందితుల తరపున మాత్రం ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గీని పెట్టుకున్నారని చెప్పారు. రేపటి విచారణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన స్టే మీద ఉన్నారని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో, ఉదయం బీజేపీ వారితో తిరిగారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిన్న బయటకు వచ్చినందనే రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారని అన్నారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సిన సొమ్మును పంట చేతికి వచ్చాక ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి, తమ పార్టీ అధినేత కేసీఆర్ స్థాయి ఏమిటో తెలంగాణ ప్రజలకు నిన్నటి బహిరంగ సభలతో అర్థమైందని అన్నారు. కేసీఆర్ జగిత్యాల సభ ప్రసంగాన్ని 36 లక్షలమంది చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షలమంది మాత్రమే చూశారని అన్నారు. రేవంత్ రెడ్డి తెలిసి చేశారో లేక తెలియక చేశారో కానీ కేసీఆర్ సభ సమయంలోనే రేవంత్ రెడ్డి తన సభను ఏర్పాటు చేసుకోవడంతో ఎవరి రేటింగ్ ఏమిటో తెలిసిందని అన్నారు.