బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్

Key post to Jeevan Reddy in BRS
  • బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటన
  • తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడి
  • కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగిస్తానన్న కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీలో చేరిన జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ కీలక పదవిని ప్రకటించారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు.

భిన్న రాజకీయ వేదికల కారణంగా వేర్వేరుగా పనిచేశామని, వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఇద్దరం కలిసి ఎంతో పని చేశామని, నాలుగున్నర దశాబ్దాలుగా తాము స్నేహితులమేనని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి తనను కలిసి ఒక బ్రిడ్జి అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరితే అన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆయనకు పదవులు కొత్తకాదని, నికార్సైన వ్యక్తి అని కేసీఆర్ అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని ఆయనకు చెప్పానని, ఇక నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు ఆయన భుజాల పైనే పెడతానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే జీవన్ రెడ్డికి బ్రహ్మాండమైన పదవి వస్తుందని తెలిపారు. జగిత్యాల యుద్ధం మీ వంతు తెలంగాణ యుద్ధం మా వంతు అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని, తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉండేదని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజులు ఉండేవని అన్నారు. మన బతుకు, మన భాష, మన ఉద్యోగాల మీద దాడి జరిగేదని అన్నారు. హైదరాబాద్‌లో నిరసన తెలిపేందుకు వస్తే బషీర్‌బాగ్ కాల్పులు జరిపారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను బయలుదేరితే అవహేళనలు చేశారని అన్నారు.
Go Back to Shorts
Jeevan Reddy join BRS
Jeevan Reddy appointed Jeevan Reddy
Jeevan Reddy BRS post

More Telugu News