లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడి ఉన్మాదం.. ఏసు విగ్రహంపై దాడి

  • చర్చిలో ఏసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు
  • ఘటనపై తీవ్ర నిరసనలు.. స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళం
  • దర్యాప్తునకు ఆదేశించామని, చర్యలు తీసుకుంటామని ఐడీఎఫ్ ప్రకటన
  • ఘటనను ధ్రువీకరించిన స్థానిక మున్సిపాలిటీ అధికారులు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఓ ఇజ్రాయెల్ సైనికుడి చర్య తీవ్ర వివాదానికి దారితీసింది. లెబనాన్‌లోని ఓ క్రైస్తవ గ్రామంలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

దక్షిణ లెబనాన్‌లోని డెబెల్ అనే క్రైస్తవ గ్రామంలోని చర్చి ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిలువ నుంచి కిందకు దించినట్లుగా ఉన్న క్రీస్తు విగ్రహం తలపై సైనికుడు సుత్తితో కొడుతున్న దృశ్యాలు క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. యుద్ధ క్షేత్రంలో మతపరమైన చిహ్నాలపై ఇలాంటి దాడులు చేయడం అమానుషమని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై విమర్శలు తీవ్రం కావడంతో ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) స్పందించింది. వైరల్ అవుతున్న ఫొటోల్లోని చర్యలు తమ సైనిక విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని ఐడీఎఫ్ ప్రతినిధి నదవ్ శోషానీ తెలిపారు. ఫొటో నిజమైనదని తేలితే, బాధ్యుడైన సైనికుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

కాగా, డెబెల్ మున్సిపాలిటీ అధికారులు ఈ ఘటన జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు. అయితే, విగ్రహానికి జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Israel soldier
Lebanon
Israel
Jesus Christ statue
Debel
IDF
Christian village
religious vandalism
Middle East conflict
Israel Defense Forces

More Telugu News