అక్షయ తృతీయ: బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • అక్షయ తృతీయ రోజున రికార్డు స్థాయిలో బంగారం ధరలు
  • హైదరాబాదులో రూ.1.55 లక్షలు దాటిన తులం బంగారం (24K) ధర
  • స్థిరంగా కొనసాగుతున్న కిలో వెండి ధర
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పర్వదినాన చిన్న బంగారు వస్తువు కొనుగోలు చేసినా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని మహిళల నమ్మిక. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోలుదారులకు ఆందోళన కల్గిస్తోంది.  

ఆదివారం ఉదయం నాటి ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,42,800గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.1,55,930, చెన్నైలో రూ.1,56,660 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది. కాగా, బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను సరిచూసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

 

Akshaya Tritiya
Gold Price
Silver Price
Hyderabad Gold Rate
Vijayawada Gold Rate
Chennai Silver Rate
Gold Rate Today
Commodity Market
Akshaya Tritiya Gold Purchase

More Telugu News