తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత

  • ఉదయం నుంచే బయటకు రాలేని పరిస్థితులు
  • నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచన
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. కొమురంభీమ్ జిల్లాలోని కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్ జిల్లాలోని మొండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలకు పైగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే రోజున అత్యధిక ఉష్ణోగ్రత 43.4 డిగ్రీలు కాగా, ఈ సంవత్సరం నేడు 44.6 డిగ్రీలుగా నమోదైంది. రోజురోజుకు ఎండలు పెరుగుతున్నందున చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరింది.

Telangana Heatwave
Telangana Weather
Hyderabad Weather
Komaram Bheem District
Kerameri

More Telugu News