అడవి పందులను తరిమిన రోబో.. పోలాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో!

  • పోలాండ్‌లో జనవాసాల్లోకి వస్తున్న అడవి పందులు
  • వాటిని తరమడానికి రంగంలోకి దిగిన 'ఎడ్వర్డ్' రోబో
  • రోబోను చూసి భయంతో పారిపోయిన పందులు
  • వన్యప్రాణుల సమస్యకు టెక్నాలజీతో వినూత్న పరిష్కారం
పోలాండ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నివాస ప్రాంతాల్లోకి చొరబడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న అడవి పందుల గుంపును తరిమికొట్టేందుకు 'ఎడ్వర్డ్' అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రయోగించారు. ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. పోలాండ్‌లోని గడినియా లాంటి తీరప్రాంత నగరాల్లో అడవి పందుల సంచారం ఇటీవల ఎక్కువైంది. ఆహారం కోసం ఇవి పార్కులు, నివాస సముదాయాల్లోకి వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మనుషులు నేరుగా వాటిని తరిమే ప్రయత్నం చేయడం ప్రమాదకరం కావడంతో, అధికారులు టెక్నాలజీ సహాయం తీసుకున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఎడ్వర్డ్’ అనే హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించారు. మనిషిలా రెండు కాళ్లపై నడుస్తూ, ఈ రోబో పందుల గుంపు వైపు వెళ్లగా.. దాన్ని చూసిన పందులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాయి. రోడ్డు పక్కన పచ్చికలో ఉన్న పందులను ఎడ్వర్డ్ వెంబడించడం, అవి పారిపోవడం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నగరాల్లో వన్యప్రాణుల సమస్యను ఎదుర్కోవడానికి ఇలాంటి వినూత్న టెక్నాలజీని ఉపయోగించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రోబోలను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Edward robot
Poland wild boars
Gdynia
wild boar control
humanoid robot
animal control
robotics
wildlife management
Poland news

More Telugu News