Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెజాన్‌లో కొడుకు ఉద్యోగం.. ఆఫర్ లెటర్ చదువుతున్న తండ్రి వీడియో వైరల్!

Techies Father Reads Amazon Offer Letter Emotional Moment Goes Viral
Advertisement
  • విజయం వెనుక ఉన్న కష్టాన్ని ఈ ఒక్క క్షణం చూపిస్తుందంటూ కామెంట్స్
  • తండ్రి హుందాగా స్పందించిన తీరు నెటిజ‌న్ల‌ను ఆకట్టుకున్న వైనం
  • ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షైలేంద్ర యాదవ్ అనే టెకీ
Advertisement
తాను సాధించిన విజయాన్ని చూసి తల్లిదండ్రులు పొందే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అలాంటి ఓ అపురూపమైన క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. షైలేంద్ర యాదవ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్, తనకు అమెజాన్ కంపెనీలో ఉద్యోగం వచ్చిన ఆఫర్ లెటర్‌ను తన తండ్రి చదువుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "మా నాన్న నా ఆఫర్ లెటర్ చదువుతున్నారు" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో షైలేంద్ర తండ్రి ఎంతో ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఆ ఆఫర్ లెటర్‌లోని ప్రతి అక్షరాన్ని చదువుతూ కనిపించారు. కొడుకు సాధించిన విజయాన్ని ఆయన ఎలాంటి ఆర్భాటం లేకుండా, హుందాగా, నిశ్శబ్దంగా ఆస్వాదించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. విజయం అంటే ఎప్పుడూ పెద్దగా అరుస్తూ జరుపుకోవడం కాదని, ఇలాంటి నిశ్శబ్ద క్షణాలలో కూడా లోతైన ఆనందం దాగి ఉంటుందని ఈ వీడియో నిరూపించింది.

నెటిజన్ల స్పంద‌న ఇలా..!
ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "నా కల కూడా ఇదే. నాన్నలు దేవుడి స్వరూపాలు. మీకు అభినందనలు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరినప్పుడు తండ్రులకు ఇంతకంటే గర్వకారణమైన క్షణం ఉండదు" అని మరొకరు పేర్కొన్నారు. 

ఇక‌, ఇలాంటి 'దేశీ పేరెంట్స్' సహజ స్పందనలు ఇటీవల సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం శివాంశు రంజన్ అనే ఐఐటీ బీహెచ్‌యూ గ్రాడ్యుయేట్, తనకు అమెజాన్‌లో ఉద్యోగం వచ్చిందని తండ్రికి టెక్స్ట్ చేయగా, ఆయన కేవలం "ఓకే" అని సమాధానం ఇవ్వడం కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలు పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు చూపించే నిరాడంబరమైన గర్వాన్ని, వారి ప్రేమను ప్రతిబింబిస్తున్నాయి.
Advertisement
Advertisement
Viral Video
Shailendra Yadav
Amazon
Job Offer
Software Engineer
Parents Pride
Indian Parents
IIT BHU
Shivanshu Ranjan
Desi Parents

More Telugu News