అక్రమాస్తుల కేసు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండ్రోజుల కస్టడీ

Kalingiri Shanti ACB Custody Granted in Illegal Assets Case
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కాళింగిరి శాంతిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నగర ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆమెను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న శాంతిని ఏసీబీ అధికారులు త్వరలోనే కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఈ నెల 7న శాంతికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో సుమారు 10 గంటల పాటు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో ఆమె ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.

సోదాల సందర్భంగా విశాఖపట్నంలో ఒక నివాస ఫ్లాట్, కుంచనపల్లిలో జీ+2 భవనం, 776 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు, ఒక కారు, మోటార్‌సైకిల్‌తో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

కాగా, 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో ఏసీగా నియమితులైన శాంతి, రెండేళ్ల వ్యవధిలో రెండోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవకతవకల ఆరోపణలతో ఆమెను సస్పెండ్ చేశారు. జులై 2024 నుంచి మార్చి 2026 వరకు సస్పెన్షన్‌లో ఉన్న ఆమెపై, గత నెలలోనే సస్పెన్షన్ ఎత్తివేయగా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మరోవైపు, తన రెండున్నరేళ్ల కుమారుడిని కలిసేందుకు ములాఖత్ అనుమతి కోరుతూ శాంతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కోర్టు ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
Go Back to Shorts
Kalingiri Shanti
Devadaya Department
ACB Raids
Disproportionate Assets Case
Andhra Pradesh Corruption
APPSC Recruitment
TDP Government
Assistant Commissioner Arrest
Vijayawada Jail
Corruption Case

More Telugu News