సన్ రైజర్స్ ఇవాళైనా నెగ్గేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

Sunrisers Hyderabad vs Rajasthan Royals Riyan Parag Wins Toss
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

కాగా, ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచింది. దాంతో నేటి మ్యాచ్ ఆ జట్టుకు ఎంతో కీలకం. పైగా సొంతగడ్డపై విజయంతో మళ్లీ గెలుపుబాట పట్టాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. 

టాస్ గెలిచిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ సీజన్‌లో ఈ వికెట్‌ను తొలిసారి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆరంభంలో పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ ఛేదనలో మాకు మంచి రికార్డు ఉంది" అని తెలిపాడు. సంజూ శాంసన్, సంగక్కరల నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకున్నానని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్టు వెల్లడించాడు. హెట్‌మెయయర్ స్థానంలో ప్రిటోరియస్ అరంగేట్రం చేస్తుండగా, బ్రిజేశ్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే జట్టులోకి వచ్చాడు.

సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. "గతంలో అండర్-19, రాష్ట్ర జట్లకు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోంది. కెప్టెన్సీ బాధ్యతలు ఆటగాడిగా మరింత రాణించేందుకు స్ఫూర్తినిస్తాయి" అని అన్నాడు. జట్టులో ఒక మార్పు చేసినట్టు, హింగే తుది జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ. 
ఇంపాక్ట్ సబ్స్: స్మరణ్ రవిచంద్రన్, షాకిబ్ హుస్సేన్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, హర్షల్ పటేల్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే. 
ఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, షిమ్రాన్ హెట్‌మెయర్, రవి సింగ్, శుభమ్ దూబే, బ్రిజేశ్ శర్మ.
Go Back to Shorts
Riyan Parag
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL 2024
Rajiv Gandhi International Stadium
Toss
Cricket
Sanju Samson
Orange Army
Indian Premier League

More Telugu News