మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు: పంజాగుట్ట పోలీసుల కీలక వివరణ

Mangli Advocate Subbarao Controversy Panjagutta Police Clarification

సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య కొనసాగుతున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ కేసులో వస్తున్న వివిధ రకాల ఆరోపణలపై పంజాగుట్ట సీఐ రామకృష్ణ మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు.


ఈ వివాదం వెనుక ఒక పెద్ద ఫైనాన్స్ స్కామ్ ఉందనే వార్తలపై సీఐ స్పందిస్తూ... ఇప్పటివరకు తమకు ఆ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. బాధితులుగా చెప్పుకుంటున్న వారు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి రారని తెలిపారు. కొంతమంది బాధితులతో కలిసి సుబ్బారావు స్టేషన్‌కు వచ్చిన సమయంలో, ఆయన మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. తక్షణమే నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో 27 ఎంజీ ఆల్కహాల్ శాతం నమోదైనట్లు వెల్లడించారు. 


టెస్ట్ చేస్తున్న సమయంలో సుబ్బారావు మీడియా సాక్షిగా హంగామా సృష్టించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రెండు వర్గాల ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నామని, చట్టప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తామని పంజాగుట్ట సీఐ తెలిపారు.

Go Back to Shorts
Mangli
Singer Mangli
Advocate Subbarao
Panjagutta Police
Hyderabad Police
Finance Scam
Breath Analyzer Test
Drunk and Drive
Police Investigation
Telangana News

More Telugu News