మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...?
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే, ఈసారి క్రికెట్ వల్ల కాదు, ఓ కొత్త వివాదంతో. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు చాహల్ వ్యక్తిగత సందేశం పంపాడని నటి, మోడల్ తాన్యా ఛటర్జీ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్న చాహల్‌కు, ఈ కొత్త వివాదం తలనొప్పిగా మారింది.
'గందీ బాత్', 'తిత్లియాన్' వంటి ఓటీటీ షోలతో గుర్తింపు పొందిన తాన్యా ఛటర్జీ, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ఇన్స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌ను చూపించింది. తన స్టోరీకి చాహల్ స్పందిస్తూ 'ఆప్ క్యూట్ హో' (మీరు క్యూట్‌గా ఉన్నారు) అని మెసేజ్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అయింది. అయితే, తాన్యా ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వివాదం తెరపైకి రావడానికి కొద్ది రోజుల ముందే చాహల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కారు నడుపుతూ సిగరెట్ తాగి, దానిని రోడ్డుపై పడేస్తున్నట్లుగా ఉన్న ఓ వ్యక్తి వీడియో వైరల్ కాగా, ఆ వీడియోలో ఉన్నది చాహలేనంటూ అభిమానులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.
చాహల్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2025లో అతను తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్జే మహ్వాష్తో అతను సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా, కొన్నాళ్లకే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్, ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 3 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. మైదానం వెలుపల ఇలాంటి వివాదాలు చుట్టుముడుతున్నా, తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించినట్లు చాహల్ ఇటీవల వెల్లడించాడు. "నేను మద్యం సేవించడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. ఇప్పుడు నా వయసు 35. జట్టు కోసం 150 శాతం కష్టపడాలనుకుంటున్నాను. ఒక సీనియర్ ఆటగాడిగా నా నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాలి" అని ఏబీ డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో చాహల్ పేర్కొన్నాడు. గతేడాది పంజాబ్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన చాహల్, ఈసారి కూడా ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్నాడు.