సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన రామ్ పోతినేని
- ఒంటరితనం తనకు ప్రశాంతతను ఇస్తుందని వెల్లడి
- ఎవరైనా జీవితంలోకి వచ్చినా, రాకపోయినా సంతోషమేనన్న రామ్
- లాక్డౌన్లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే గడిపానని వెల్లడి
చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డానని రామ్ తెలిపారు. ఖాళీ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తానని, ఆ ఏకాంతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వివరించారు. స్నేహితులతో గడపడం ఇష్టమే అయినా, తన కోసం తాను సమయం కేటాయించుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుందన్నారు.
అయితే, తన జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం గడపడానికి సిద్ధమేనని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగా మరింత సంతోషంగా ఉంటానని రామ్ పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎప్పుడూ వందలాది మందితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అంతమంది మధ్యలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నానని అన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు ఒంటరిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.