వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్
- బెంగళూరులో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
- డబ్బు, ఆస్తి కోసం మహిళ బ్లాక్‌మెయిల్ చేసిందని కుటుంబం ఆరోపణ
- గతంలో పోలీసుల వద్ద రాజీ కుదిరినా వేధింపులు ఆగలేదన్న బంధువులు
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. దిలీప్‌కు జిమ్‌లో 42 ఏళ్ల వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చనువుగా మారడంతో, ఆమె డబ్బు, ఆస్తి కోసం దిలీప్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. గతంలో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా, ఆమె భర్త సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆపలేదని, నిరంతరం వేధించడంతోనే దిలీప్ ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.