మా అమ్మాయి మైనరే... సినిమా ఆశ చూపి తీసుకెళ్లారు: మోనాలిసా తల్లి
కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోస్లే పెళ్లి వ్యవహారం అనూహ్య మలుపు తిరగడం తెలిసిందే. ఆమె మైనర్ అని ఇటీవలే వెల్లడి కావడం, ఆమెను పెళ్లాడిన ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మోనాలిసా తల్లి లతా భోస్లే స్పందించారు. తన కుమార్తె మైనర్ అని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్లాడని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆమె మాట్లాడుతూ, తన కూతురిని తనకు అప్పగించాలని అధికారులను వేడుకున్నారు.
"నా కూతురు మైనర్. పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అతను మాయమాటలు చెప్పాడు. బర్త్ సర్టిఫికెట్ మార్పిస్తే అంతా సర్దుకుంటుందని నమ్మించాడు" అని లతా భోస్లే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తన కుమార్తె జననానికి సంబంధించిన పత్రాలను ఎంతో కష్టపడి సంపాదించానని, వాటి ప్రకారం ఆమె మైనర్ అని స్పష్టమైందని తెలిపారు.
ఈ వివాదంపై విచారణ చేపట్టిన జాతీయ గిరిజన కమిషన్ (NCST), మోనాలిసా అసలు పుట్టిన తేదీ 2009 డిసెంబర్ 30 అని, వివాహ సమయానికి ఆమె వయసు 16 సంవత్సరాలేనని నిర్ధారించింది. పెళ్లి కోసం నకిలీ జనన ధ్రువపత్రం సృష్టించి ఉంటారని కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, మధ్యప్రదేశ్ పోలీసులు మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మార్చి 11న తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లో ఉన్న ఓ ఆలయంలో వీరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు తమకు కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉందని ఈ జంట పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. తాజా పరిణామాలతో ఈ కేసుపై మరింత విచారణ జరిపేందుకు ఏప్రిల్ 22న ఢిల్లీకి హాజరు కావాలని కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలను జాతీయ కమిషన్ ఆదేశించింది.