తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 2026 మే/జూన్ కు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సులకు చెందిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల కోసం ఈ షెడ్యూల్‌ను ప్రకటించింది. థియరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమై మే 21వ తేదీన ముగుస్తాయి.

ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలను మే 22 నుంచి 25 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5) నిర్వహిస్తారు. మే 26న ఇంగ్లీష్ ప్రాక్టికల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు, మే 28న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనుంది.

థియరీ పరీక్షల పూర్తి షెడ్యూల్:
మే 13 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 (ఫస్టియర్); సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 (సెకండియర్) 
మే 14 (గురువారం): ఇంగ్లీష్ పేపర్-1 (ఫస్టియర్); ఇంగ్లీష్ పేపర్-2 (సెకండియర్) 
మే 15 (శుక్రవారం): మ్యాథ్స్-1A, బోటనీ-1, పొలిటికల్ సైన్స్-1 (ఫస్టియర్); మ్యాథ్స్-2A, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2 (సెకండియర్) 
మే 16 (శనివారం): మ్యాథ్స్-1B, జువాలజీ-1, హిస్టరీ-1 (ఫస్టియర్); మ్యాథ్స్-2B, జువాలజీ-2, హిస్టరీ-2 (సెకండియర్) 
మే 18 (సోమవారం): ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 (ఫస్టియర్); ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 (సెకండియర్) 
మే 19 (మంగళవారం): కెమిస్ట్రీ-1, కామర్స్-1 (ఫస్టియర్); కెమిస్ట్రీ-2, కామర్స్-2 (సెకండియర్) 
మే 20 (బుధవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-1 (ఫస్టియర్); పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-2 (సెకండియర్) 
మే 21 (గురువారం): మోడరన్ లాంగ్వేజ్-1, జాగ్రఫీ-1 (ఫస్టియర్); మోడరన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2 (సెకండియర్)

ఈ తేదీలు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా వర్తిస్తాయని, అయితే వారికి సంబంధించిన పూర్తి టైమ్‌టేబుల్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.

TSBIE
Telangana Intermediate
Inter Supplementary Exams 2026
Telangana Board
Inter Exams Schedule
Telangana Education
Inter First Year Exams
Inter Second Year Exams
TS Inter Exams
Supplementary Exam Dates

More Telugu News