ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన
భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో భారతీయ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. దక్షిణాది తారలు చిరంజీవి, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు, విక్రమ్ ప్రభు వంటి వారు సోషల్ మీడియా వేదికగా ఆమెకు కన్నీటి నివాళులు అర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' వేదికగా ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించారు. "ఆశా భోంస్లే గారి గొంతు భారతీయ సినిమాకు తరతరాలుగా నిలిచిపోయే ఓ అపురూపమైన తోడు. ఎన్నో భావోద్వేగాలను పలికించింది. ప్రతి పాటలోనూ ఆమె చూపిన అప్రయత్నమైన శైలి, వైవిధ్యం నన్ను ఎప్పుడూ ఆకట్టుకునేవి. భారతీయ సినిమా భర్తీ చేయలేని గొంతుకలలో ఒకదాన్ని కోల్పోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా 'ఎక్స్'లో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేసి హిందీలో నివాళి అర్పించారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, "ఆశా జీ, మిమ్మల్ని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా అనిపిస్తోంది. ఎందుకంటే మీ గొంతు నా చిత్రాలను ఆశీర్వదించింది" అని ఇన్స్టాగ్రామ్‌లో రాశారు. మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పందిస్తూ, "హద్దులు దాటిన గొంతుక ఆమెది. ఆమె లేని లోటు భారతీయ సినిమాకు, సంగీత ప్రపంచానికి తీరనిది" అని పేర్కొన్నారు.
ఈ వార్త తెలిసిన వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, "ఆశా భోస్లే గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. దశాబ్దాలుగా భారత సినిమాకు ఆమె మాయా గాత్రం గుండెచప్పుడులా నిలిచింది. ఆమె వారసత్వం తరతరాలకు నిలిచిపోతుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి," అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ, "ఆశా భోస్లే గారితో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె గొంతు కేవలం సంగీతం కాదు, మన జీవితంలోని ప్రతి దశలో మనతో ఉన్న భావోద్వేగం. తరతరాల హృదయాలను ఆమెలా స్పృశించిన కళాకారులు అరుదు. ఆమె గాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది," అని పేర్కొన్నారు. నటుడు విష్ణు మంచు కూడా, "మనం ఆశా భోస్లే గారి పాటలను కేవలం వినలేదు.. వాటితో జీవించాం. ఇది పూడ్చలేని లోటు," అని ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన కుటుంబంతో ఆశా భోస్లేకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "ఆశా గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించేవారు. ఆమె మా కుటుంబ సభ్యురాలు. చెన్నై వచ్చినప్పుడల్లా మా తాత శివాజీ గణేశన్ ఇంట్లోనే ఉండేవారు" అని తెలిపారు. ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ఆమెకు నివాళులు అర్పించారు.