సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం
ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 26 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ స్పెషలైజ్డ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,00,000 వరకు జీతం ఉంటుంది.
అర్హతల విషయానికి వస్తే.. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్, బీఎస్సీ, ఎంబీఏ లేదా సీఏ పూర్తి చేసి, 3 నుంచి 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175, మిగతా వర్గాల వారు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ centralbank.bank.in ను సందర్శించాలని అధికారులు సూచించారు.