దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే
భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శనివారం తీవ్రమైన నీరసం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆమె మరణ వార్తను కుమారుడు ఆనంద్ భోంస్లే, మనవరాలు జానై భోంస్లే ధృవీకరించారు.
ఆమె పార్థివ దేహాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆమె నివాసంలో ఉంచనున్నారు. అనంతరం, సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కు ఆశా భోంస్లే స్వయానా సోదరి. బ్రిటీష్ ఇండియాలోని సాంగ్లీ స్టేట్ లో 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. 1943లో ఆమె తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (2011)లో స్థానం సంపాదించారు. తెలుగులో కూడా ఆమె పాడిన ఎన్నో పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ఆమె మరణం భారత సంగీత ప్రపంచానికి తీరని లోటు.