మరో ఆసక్తికర కథతో తిరువీర్.. ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశారా?

‘మసూద’, ‘పరేషాన్’,  ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్’వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తిరువీర్, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ నెల‌ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇది ఒక సామాన్య యువకుడి జీవితంలో జరిగే వింతైన, వినోదాత్మకమైన సంఘటనల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రతాప్ అనే హీరో పాత్ర పడే కష్టాలు, అతడి చుట్టూ ఉండే పరిస్థితులు ప్రేక్షకులలో నవ్వులు పూయిస్తూనే, కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. తన సహజమైన నటనతో ఆకట్టుకునే తిరువీర్, ఈ సినిమాలో కూడా తనదైన శైలిలో మెప్పించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

ట్రైలర్‌లోని విజువల్స్, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను చక్కగా ప్రతిబింబించాయి. కేవలం వినోదమే కాకుండా కథలో ఏదో బలమైన అంశం కూడా ఉందని ట్రైలర్‌ను బ‌ట్టి చెప్పొచ్చు. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌.పీ దుర్గ నరేశ్‌ దర్శకత్వం వహిస్తుండగా, పాయల్  రాధాకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు.


Papam Pratap Trailer
Tiruveer
Telugu Movie
Masooda
Pareshan
The Great Pre Wedding
Payal Radhakrishna
SP Durga Naresh
Rakesh Reddy Gaddam
Telugu Cinema

More Telugu News