సన్‌రైజర్స్ ప్రపంచ రికార్డు.. జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్

Abhishek Sharma Equals Jayasuriya Record Sunrisers Create World Record
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) బ్యాటర్లు మరోసారి విధ్వంసం సృష్టించారు. పంజాబ్ కింగ్స్‌తో ముల్లన్‌పూర్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు జోడించి సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం 8 ఓవర్లలోనే జట్టు స్కోరును 120 పరుగులకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. పవర్‌ప్లేలోనే ఏకంగా 7 సిక్సర్లు బాదిన అతను, ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన సనత్ జయసూర్య, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 8 సిక్సర్లు కొట్టాడు.

ఈ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో పవర్‌ప్లేలో మూడుసార్లు 100కు పైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. ఇంతకుముందు ఏ జట్టూ ఈ ఘనతను ఒక్కసారికి మించి సాధించలేదు. 2024లో ఢిల్లీపై 125, లక్నోపై 107 పరుగులు చేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఇప్పుడు మూడోసారి ఈ ఫీట్‌ను అందుకుంది.

అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ అరోరా, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేశాడు. పంజాబ్ జట్టులో ప్రియాన్ష్ ఆర్య తుది జట్టులోకి వచ్చాడు.


Go Back to Shorts
Abhishek Sharma
Sunrisers Hyderabad
IPL 2024
Travis Head
Punjab Kings
Powerplay Record
Sanath Jayasuriya
T20 Cricket
Highest Score
Cricket Records

More Telugu News